ప్రశ్న: ప్రార్థించుట ఎందుకు? దేవునికి ముందే భవిష్యత్తు అంతటిని గురించి తెలిసినపుడు మరియు సమస్తమును ఆయన అధికారములోనున్నపుడు ప్రార్థించుటలోని గొప్పతనమేముంది. మనము దేవుని మనస్సును మార్చలేము, అయినా మనమెందుకు ప్రార్థించాలి?
జవాబు: క్రైస్తవునికి ప్రార్థన అనేది ఒక శ్వాసలాంటిది. అది చేయకుండా ఉండేదానికంటే, చేసినట్లయితే చాల సులభముగా ఉంటుంది. మనము అనేక కారణములకొరకై ప్రార్థిస్తాము. మరి ఒక దానికొరకు, ప్రార్థన అనేది దేవునిని సేవించుచున్నట్లే (లూకా 2:36-38) మరియు ఆయనకు విధేయత చూపించటం. మనము ప్రార్థిస్తాము ఎందుకంటే దేవుని ఆఙ్ఞ కాబట్టి (ఫిలిప్పీయులకు 4:6-7). ప్రార్థనకు క్రీస్తు మరియు ఆది సంఘము ఉదాహరణగా నున్నారు (మార్కు 1:35; అపొస్తలులకార్యములు 1:14; 2:42; 3:1; 4:23-31; 6:4; 13:1-3). ఒకవేళ యేసు ప్రార్థించుట లాభప్రదాయము అన్నట్లయితే , మనము కూడా ప్రార్థించాలి. ఒకవేళ ఆయన తండ్రి చిత్తములో నిలిచియుండుటకు అవసరమయినట్లయితే, మనమింకెంత ప్రార్థించాల్సిన అవసరత ఉందో?
ప్రార్థించుటకు మరియొక కారణము దేవుడు ప్రార్థనను ఉద్దేశించినదే అనేకమైన పరిస్థితులలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారము పొందుటకు. మనము ప్రధానమైన విషయాలు నిర్ణయించుటకు గాను సంసిధ్దులవుటకై ప్రార్థిస్తాము (లూకా 6:12-13); సాతాను అడ్డ్డంకులపై విజయము పొందుటకు (మత్తయి 17:14-21);ఆత్మీయపంటను కోయుటకు పనివారిని సమకూర్చుటకై (లూకా 10:2); శోధనలను జయించుటకొరకు బలము పొందుటకై(మత్తయి 26:41); మరియు ఇతరులను ఆత్మీయంగా శక్తినింపుదలను పొందుటకు ప్రార్థించవలెను (ఎఫేసీయులకు 6:18-19).
దేవుని దగరకు ప్రత్యేకమైన విన్నపములతో వస్తాము, మరియు మనకు దేవుని వాగ్ధానములున్నవి మన ప్రార్థనలు వ్యర్థముకావని, మనము ప్రత్యేకంగా అడిగినవాటికి ఒకవేళ జవాబు పొందనప్పటికి (మత్తయి 6:6; రోమా 8:26-27). దేవుని చిత్తప్రకారము ప్రార్థించినట్లయితే , మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఆయన వాగ్ధానముచేసెను, మనమేమి అడిగినను అవి మనకు కలిగినవని యెరుగుదుము." (1యోహాను 5:14-15). కొన్ని సార్లు ఆయన తెలివి మరియు మన క్షేమాభివృధ్దికొరకై జవాబులనియ్యకుండా ఆయన ఆలస్యము చేయును. ఇలాంటి పరిస్థితులలో, మనము శ్రధ్దతోను మరియు పట్టువిడువకుండా ప్రార్థించాలి (మత్తయి 7:7; కూకా 18:1-8). ప్రార్థన అనేది మన చిత్తాన్ని భూమిమీద నెరవేర్చుకోటానికి ఒక ఉపాయముగా చూడకూడదు, గాని దేవుని చిత్తము భూమిమీద నెరవేర్చటానికి ఒక కారణమవ్వాలి. దేవుని ఙ్ఞానం మన స్వంత దానికన్నా అధికంగా మించినది.
కొన్ని పరిస్థితులలో ప్రత్యేకముగా మనము దేవుని చిత్తమును తెలిసికొనలేము, ప్రార్థన అనేది మనము ఆయన చిత్తాన్ని వివేచించటానికి ఒక సాధనము. ఒకవేళ ఆ సిరియా దేశానికి చెందిన స్త్రీ తన కుమార్తే దయ్యపు ఆత్మతో భాధింపబడినపుడు ఆమె క్రీస్తుకు ప్రార్థించకుండినయెడల, తన కుమార్తె సంపూర్తిగా స్వస్థతనొందేదికాదు (మార్కు 7:26-30). యెరికో బయటనున్న గ్రుడ్డివాడు క్రీస్తును వేడుకొనికుండా యుండినట్లయితే, ఆ గ్రుడ్డివానిని ఙ్ఞాపకముంచుకొనేవాళ్ళము కాదు (లూకా 18:35-43). దేవుడు చెప్పాడు మనము ఆశించుచున్నవి దేవునిని అడగనందున మనకేమియు దొరకదు (యాకోబు 4:2). మరియొక విధంగా, ప్రార్థన అనేది ప్రజలతో సువార్తను పంచుకొనటమే. మనము సువార్తను చెప్పేంతవరకు ఆ సువార్తను గూర్చిన ప్రసంగానికి ఎవరు దానికి ప్రతిస్పందిస్తారో అనేది మనము చెప్పలేము. అదేవిధముగా, మనను ప్రార్థించేంతవరకు జవాబు దొరికిన ప్రార్థనల ఫలితాన్ని చూడలేము.
ప్రార్థన లేమి అనేది విశ్వాసములోనున్న లోపాన్ని మరియు దేవుని వ్వక్యంపట్ల అపనమ్మికత్వాన్ని ప్రదర్శిస్తుంది. మనము దేవునియందు విశ్వాసాన్ని ప్రదర్శించటానికి ప్రార్థిస్తాము, అది ఆయన తన లేఖనములలో వాగ్ధానముచేసినట్లు చేస్తాడు మరియు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా ఆయన చేయ శక్తిగలమంతుడు (ఎఫెసీయులకు 3:20). ప్రార్థన అనేది ఇతర జీవితాలలో దేవిని కార్యాన్ని చూడటానికి ఇది మన ప్రాధమిక సాధనము. ఎందుకంటే అది దేవుని శక్తికి "బిరడావేసినట్టు" పొందుకొనుటకు మన సాధనము, సాతానును ఓడించటానికి అది ఒక సాధనము మరియు మనవలనే అంధకారశక్తులను పోగొట్టుకొనటానికి మనము శక్తిలేనివారము. అందుచేత, దేవుడు ఆయన సింహాసనముందు మనలను ఆయన కనుగొనునుగాక, ఎందుకంటే అమన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవముకలవాడు పరలోకమందున్నాడు (హెబ్రీయులకు 4:15-16). నీతిమంతుని విఙ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండి దాని ప్రతిఫలముపొందును (యాకోబు 5:16-18). ఆయన సన్నిధిలోనికి విశ్వాసముతో తరచుగా వచ్చి ప్రార్థించినపుడు మనజీవితాలలో దేవుని నామము మహిమ పరచబడునుగాక.
0 Comments