పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ను ఇంగ్లీషు
భాషలోనికి అనువదించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన విలియం టిందేల్ 1496 సం || లో ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు . చిన్నతనము నుండి భక్తిమార్గము అవలంబించుచూ మంచి యౌవ్వన ప్రాయమందు యేసుక్రీస్తు ప్రభువును త రక్షకునిగా అంగీకరించెను .
విద్యావంతుడైన టిండేల్ దైవిక సాహిత్యమును ఎక్కువగా ప్రేమించుచు ఆయా భాషలలోని పుస్తకములను పఠించుచుండెను .
గ్రీకు భాషలో దేవుని వాక్యమును చదివిన విలియం తన మాతృభాషయైన ఆంగ్లములోనికి బైబిల్ గ్రంథములోని నూతన నిబంధనను అనువదించవలెనని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడెను . ఆనాటి దినములలో సామాన్య ప్రజలెవరు బైబిల్ గ్రంథమును చదువకూడదు . కేవలం మతాచార్యులు , మత నాయకులనబడేవారు
మాత్రమే బైబిల్ గ్రంథాన్ని చదువవలెననే ఆజ్ఞ ఉ ండటంతో బైబిల్ గ్రంథం సామాన్యులకు అందక వారంతా ఆత్మీయాంధకారములో మగ్గుచుండిరి .
తన హృదయాన్ని మార్చి ఒక నూతన క్రియ తన జీవితంలో ఆరంభించి తన జీవన గమనమును శోభాయమానముగా చేసిన ఈ దివ్య గ్రంథమును
ఏవిధము చేతనైనను తన స్వజనులకు అందించ వలెనన్న దృఢ సంకల్పముతో ఉన్న విలియం టిండేల్ ఆ చట్టానికి
ఏమాత్రం బెదరక తన పని ప్రారంభించెను . ఎన్నోసార్లు అతని పనికి ఆటంకం కలిగించి అతడు అనువదించిన
కాగితములను అపహరించి ఆ మూర్ఖ్యులైన అధికారులు వాటిని కాల్చివేసి విలియంను హింసించినను నూతన
నిబంధనను అనువదించి ఇంగ్లీషు ప్రజలకు అందించెను . ముద్రించిన ఒక గ్రంథమును తెచ్చి అప్పటి ఇంగ్లాండ్ రాణికి దానిని బహుకరించెను . ఆ గ్రంథము నేటికి బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నది . మత గురువులు అతనిని బంధించి చెరసాలలో వేసెను . అంతేకాదు ఇంగ్లాండ్
రాజు విలియం టిండేల్ బహు ఘోరము చేసెనని ప్రకటించి అగ్ని చేత ఇతనిని కాల్చివేసి చంపివేసెను . దేవుని కొరకు తన ప్రాణములర్పిస్తూ ప్రభువా ! ఇంగ్లాండ్ దించవలెనని రాజు యొక్క నేత్రములు తెరువుము , రక్షించుము అని ప్రభువును వేడుకొనెను
. . టిండేల్ మరణము ఆ దేశములో గొప్ప అనబడేవారు
ఆత్మీయ విప్లవానికి నాంది పలికెను . అతడు
మరణించిన తర్వాత సాధారణ ప్రజలెంతో మంది
క్రొత్త నిబంధన గ్రంథమును కలిగి చదివి ఎంతో
ఆశీర్వదింపబడిరి . విలియం టిండేల్ అందరిని ఆధ్యాత్మికంగా మండించుట కొరకు తపన చెంది మనమును తను మంటలలో ఆహుతాయెను . ఏది ఏమైనా గ్రంథమును
నేడు మనమనుభవిస్తున్న ఆధ్యాత్మిక వనరులు
ఇటువంటి ధీరుల త్యాగఫలమే అనుటలో
సందేహం లేదు .
0 Comments