విమర్శ: పరిశుద్ధ గ్రంథములోని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన యెడల యూదా మరణ విషయములో ఒక చోట ఉరిపోసుకుని చచ్చాడని (మత్తయి 27:5) యింకొక చోట తలక్రిందుల బడి పొట్టపగిలి చచ్చాడని (అపొ.కా 1:18) ఎందుకు వ్రాయ బడెను?
జవాబు : "అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసిపోయి ఉరి పెట్టు కొనెను” (మత్తయి 27:5)
ఈ యూదా వలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలం కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగు లన్నియు బయటకు వచ్చెను
(అపొ. కా॥1:18)
ఈ రెండు వాక్యములు మధ్య భేదమున్నట్లు కనబడుచున్నను నిశ్చయముగా యే భేదము లేదని చదువరులు నిదానించి చదువుట వలన గ్రహింపగలరు. లూకా వ్రాసినటువంటి అపొస్తలుల కార్యముల యందు పేతురు ప్రసంగించిన వాటిలో యూదాను గూర్చి పేతురు చెప్పుట చేత లూకా వ్రాసినది, పేతురు మాటలకు, మత్తయి వ్రాసిన మాటలకు ఎంతైన వ్యత్యాసమున్నదని పలువురు భావించుకొన్నను అది అబద్ధమని చెప్పగలను. (అపొ,కా1:18)లో
ఏమని వ్రాయబడినది? “ఇతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలై నందున మరణించెను అని వ్రాయ బడలేదు) అతని ప్రేగు లన్నియు బయటకు వచ్చెను అని మాత్రమే వ్రాయబడియున్నది.
(మత్తయి 27:5) దేవాలయములో పారవేసి అతడు పోయి ఉరి పెట్టుకొన్నాడు. కాని ఇతడు ఉరి పెట్టకొన్న ప్రదేశమును గూర్చి అనేకులకు తెలియక పోవుట చేత ఇటువంటి సందేహాలకు చోటి వ్వడం జరుగుతోంది. (Hinnohmvally) అనే లోయలో వున్న ఒక చెట్టుకు ఉరి పోసు కున్నాడు. యూదా “హిన్నోము” లోయలో ఉరి పోసుకొన్న పిదప ఆ చెట్టు కొమ్మ విరిగిపోవుట చేత యూదా తలక్రిందులుగా నేలకు గుద్దు కోవడంతో నడిమికి బద్దలైనందున అతని పేగులు బయటకు వచ్చెను. మత్తయి యూదా ఉరిపోసుకున్నాడని చెప్పాడు. పేతురు యూదా ఉరి పోసుకున్న తరువాత ఏమి జరిగిందో దానిని వివరించాడు. అంతే గాని వారిరువురి వాక్కు మూలములు తారతమ్యమేదియు లేదని సద్విమర్శకులు గ్రహించగలరు. ఎప్పటికి భేదములు రావు. రాజాలవు. ఎందుకనగా లేఖనములు మానవుని యిచ్ఛను బట్టి గాక పరిశుద్దాత్ముని ప్రేరేపణను బట్టి వ్రాయబడి యున్నది
బాధ పడకండి! యేసుని అమ్ముకొన్న వాడు తలక్రిందులై, బద్దలై పేగులు బయటపడి ప్రపంచములో పెద్ద ద్రోహిగా గుర్తింపబడి సామెతగా మిగిలాడు. ఈనాడు కూడ అనేకులు యేసుని అమ్ముకుంటున్నారు. వారిని హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త సుమీ! అమ్ముకొంటే మీకు యూదా వలె తప్పదు.
నమ్ముకొంటే మోక్షరాజ్యము మీకు తప్పదు. అమ్ముకుంటారు నమ్ముకుంటారో మీ యిష్టం.
SOURCE:
ALL RIGHTS RESERVED BY.
DR.J.VASABTHA BABU GAARU.
EDITOR: SATHYA SAKSHI.
CHENNAI.
0 Comments