గెత్సేమనే తోట.

                      

         
 

                       గెత్సేమనే తోట.



యేసు ప్రభువు మరణించడానికి ముందు ఆయన అప్పగింపబడిన స్థలము గెత్సేమనే తోట గెత్సేమనే అను 
మాటకు నూనె గానుగ అని అర్థము.ఇది పూర్తిగా ఒలీవల చెట్లతో నింపబడిన ఒక తోట. ఆ చెట్ల పండ్ల నుండి నూనెను తీసేవారు.అందును బట్టే దీనికి నూనె గానుగ అని పేరు వచ్చినట్టుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం.ఈ తోట యెరుషలేము కు తూర్పున ఉన్న కెద్రోను వాగుకు కొంచెం అవతల అనగా కొండకు దిగువన ఉన్నది. ప్రస్తుత కాలంలో ఎరుషలేము మనం వెళితే అక్కడ నుండి ఈ తోటను స్పష్టముగా చూడవచ్చును.
                    యేసుప్రభువు వారు ఏ రాతి దగ్గర అయితే 
ప్రార్ధన చేశారో  ఆ రాతి దగ్గర ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయానికి వెళ్లి అనేకమంది యేసు ప్రభువు ప్రార్థన చేసిన ఆ రాతిని చూచి వస్తూ గెత్సేమనే తోట
యొక్క ప్రాముఖ్యమును గుర్తిస్తూ వున్నారు. యేసుప్రభువు కు
ఈ ప్రాంతం చాలా ఇష్టం.ఆయన ఎక్కువసార్లు ఈ ప్రాంతానికి 
ఏకాంతముగా గడపటానికి వెళుతుండేవారు. ఈ విషయం
(లుకా22:39) .(యోహాను18:2) లోనూ కనబడుతుంది.
యేసుప్రభువు శ్రమ పొంది శత్రువు చేతికి అప్పగింపబడిన స్థలము ఇదే.
              మత్తయి  26:36   లో వ్రాయబడినట్లు గా యేసుప్రభువు గెత్సేమనే తోటలోక వెళ్లారు. అది ఆఖరి సారి అని ఆయనకు తెలుసు అయినప్పటికీ ఏ ప్రాంతం అయితే ఆయన బాగా ఇష్టపడ్డారో ఆ ప్రాంతంలోనే తనను తాను అప్పగించు కోవడానికి ఇష్టపడ్డారు ఆయన కొంత దూరం వెళ్లి సాగిలపడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నీ ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మాని ప్రార్ధించెను.యేసుప్రభువు మనకొక చక్కని మాదిరి ఉంచివెళ్ళారు ప్రార్ధించుటలో ఆయన చూపిన మాదిరి చాలా ప్రశస్తమైనది .ఆయన సాగిలపడి ప్రార్థించారు.
"తండ్రి నీ చిత్తమైతే" అనే ప్రార్థన ప్రతి విశ్వాసి చేయవలసిన
ప్రార్ధన.
            దేవుని చిత్తానుసారముగా ప్రార్థించడం దేవుని చిత్తానుసారముగా జీవించడం మానవుని జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు విశ్వాసులమైన మనము దేవుని చిత్త ప్రకారం గా ప్రార్థించే అనుభవం ఉండాలి అపో.యోహాను
"ఆయన ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్రాలు సారముగా మనము ఏది అడిగినా ఆయన మనవి ఆలకించును అనునదియే" అని తన పత్రికలో వ్రాశాడు.
యేసుప్రభువు తండ్రి చిత్త ప్రకారము ప్రార్ధించాడు నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఆయన కోరుకున్నాడు మనము కూడా దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబాడాలని కోరుకోవాలి.
         దేవుని చిత్తము మరియు ఆయన ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చ పడాలన్న నిలిపి చేయబడాలి అన్నా అది మనము ప్రవర్తించే తీరును బట్టి నిర్దేశించబడుతుంది.
దేవుని చిత్త ప్రకారము జీవించువాడు సదాకాలము నిలబడతాడు అని పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తున్నాయి. తండ్రి
నీ చిత్తమే జరిగించమని యేసుప్రభువు ప్రార్ధించుటయే గాక
మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్ధనచేయండి అనే సందేశాన్ని ఇచ్చారు.గెత్సేమనే తోటలో
నుండి సర్వ ప్రపంచానికి వస్తున్న సందేశమిదే.చాలాసార్లు మనము శోధనలో కి వెళ్ళినతఅర్వత ప్రార్థన చేస్తుంటాము
శోధనలో పడిపోయిన తర్వాత ఏడుస్తుంటాయి. బాధపడుతుంటాయి.కొంతమంది ప్రార్థన చేయడం సమయాన్ని వృధా చేయడం అనుకుంటారు.సమయం వృధా
చేయడం అయితే ప్రార్థన చేయమని అని ప్రభువు చెప్పి ఉండేవాడు కాడు. ఆయన ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ప్రార్థించడం దేవుని చిత్తము, దేవుని కార్యమని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.
            యేసు ప్రభువు ఈ మాట చెప్పి వెళుతూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చాడు వారితో కూడా బహుమన్ది జనసమూహము కత్తులు,గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల నుండి ప్రజల పెద్దల నుండి వచ్చారు, ఇస్కరియోతు యోగ ఏసుప్రభువును శుభమని చెప్పి ముద్దుపెట్టుకొని శత్రువులకు అప్పగించాడు. తనను అప్పగిస్తున్న ఇస్కరియోతు యోగాను ఏసుప్రభు పిలిచిన పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. చెలికాడా! అని యుదాను పిలిచాడు.ఎంత అద్భుతమైన పిలుపు.పిలుపు
వినినప్పుడైన ఇస్కరియోతు యోగ హృదయం కరిగి పోవాల్సింది మారాల్సింది అయితే యూదా తన హృదయమును కఠినము చేసుకున్నాడు.
                        నేను ఏసుప్రభువు కు ద్రోహం చేస్తున్నా ఆయనను అప్పగిస్తున్న వెండి నాణెము ల కోసం కక్కుర్తిపడి నా ఆయన నన్ను స్నేహితుడా అని పిలుస్తున్నాడు ఏమిటి అని ఆలోచిస్తే బాగుండును.మనం ఉన్న స్థితిని దాని భయంకర తత్వాన్ని గ్రహించడానికి దేవుడు కొన్నిసార్లు మనలను పిలుస్తాడు ఆదామా ఎక్కడున్నావు? అని దేవుడు అడిగాడు ఆదాము తన దౌర్భాగ్య స్థితిని గ్రహించడానికి దేవుడిచ్చిన అవకాశం అది.
చాలాసార్లు దేవుడు మనలను పిలుస్తాడు తన వాక్యము ద్వారా మాట్లాడుతాడు మన స్థితిని మన స్థాయిని మన పాపపు జీవితాన్ని గుర్తు చేసుకుంటామని ప్రభు వైపు తిరుగుదామని దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఇస్కరియోతు యూదాకు ఇవ్వబడిన అవకాశమిదే.చెలికాడా,స్నేహితుడా అని దేవుడు పిలిచినా ఇస్కరియోతు యూదా మారలేదు.
     
               గెత్సేమనే తోటలో ఏసు ప్రభువు తనను తాను అప్పగించుకున్నాడు ఆ సందర్భంలో యేసుప్రభువు శిష్య బృందం లో ఉన్న పేతురు కత్తి దూసి ప్రధానయజకుని దాసుని కొట్టి వాని చేవి తెగనారికాడు ఆ ప్రధాన యజకుని దాసుని పేరు మల్కు. ఆ వ్యక్తి చెవిని తెగనారికి నప్పుడు యేసుప్రభువు మరలా ఆ చెవిని అతికించినట్లు ప్రభువు లేఖనలలో మనము చూస్తున్నాము.ఎంత అద్భుతమైన దేవుడు తనను హింసించడానికి వచ్చినవారికి కూడా మేలు చేసేవాడు, శత్రువులకు కూడా మేలు చేసే స్వభావము. శత్రువులను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, అవసర తలలో ఉన్న వారికి సహాయం చేయమని ఏసుప్రభువు ఎన్నోసార్లు బోధించారు.తనను పట్టుకోవడానికి వచ్చిన ఆ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని ఏసుప్రభు వారు మరలా యధాస్థానంలో అతికించారు. ఆయన అద్భుతాలు చేయువాడు ఆ,కార్యాలు చేయువాడు.
             ఏసుక్రీస్తు తనకు తానే అప్పగించు కోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు గనుక ఆయన ప్రేమతో ఈ కార్యము చేశారు. తనను తాను కాపాడుకోవాలంటే 12 సేన వ్యూహము ల కంటే ఎక్కువ దేవదూతలు వచ్చి వుండే వారే. ఆయన ఇష్ట పూర్వకంగా తన్నుతాను అప్పగించు కున్నారు.ప్రియ చదువరీ ప్రభువు దగ్గరగా చేరి ఆయన చిత్త ప్రకారము ప్రార్థించడం శోధనలో పదకుండు ప్రార్ధించడం చెలికాడ అని దేవుడు పిలిచినప్పుడు మన స్థితిని గుర్తించి ఆయన వైపు తిరగ గలిగితే ప్రభువు మన జీవితంలో మేలుచేసి ఆశ్చర్య కార్యాలు
జరిగిస్తాడు.

Post a Comment

0 Comments